Tirupati Temple Stampede: తిరుపతిలో ఘోర విషాదం.. ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య

Thu, 09 Jan 2025-12:02 am,

Tirupati Temple Stampede Live Updates: తిరుపతిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వారా దర్శన టికెట్ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మృతిచెందగా.. భారీ సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌...

Tirupati Temple Stampede: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది. సంధ్య థియేటర్‌ సంఘటన మరచిపోకముందే తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుని నలుగురు మృతి చెందారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు మృతి చెందారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో భక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడుకు చేరిన మృతుల సంఖ్య


తొక్కిసలాట సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య ఏడుకు చేరింది.


రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భక్తుల ఆరోగ్య పరిస్థితి విషమం.


గురువారం ఉదయం రుయా ఆస్పత్రిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శిస్తారని సమాచారం.

Latest Updates

  • తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో భక్తుల మృతి తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని  ప్రార్థించారు.

  • "తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నా మనసును కలిచివేసింది. ఈ హృదయ విదారక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవాలి. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన సాయం అందించాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇకపై మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి" అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు.

  • తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మరణించడం పట్ల తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్ కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వ్యక్తుల కుటంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాలపాలై  హాస్పిటళ్ళలో చికిత్స  పొందుతన్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సెలవుల్లో దేవాలయాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే పరిస్థితుల  నేపథ్యంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌లను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు చర్యలు చేపట్టాలని సూచించారు.

  • గురువారం ఉ.5 గంటలకు జారీ చేయాల్సిన టోకెన్లను భక్తుల రద్దీ కారణంగా ముందుగానే ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. మరోవైపు ఎలాంటి బందోబస్తు లేకపోవడమే ఘటనకు కారణమని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు.
     

  • తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి

    ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి
    చిత్తశుద్ధిలేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చారు:
    టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారు:
    భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు:
    అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు:
    ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారు:
    గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు:
    మరి ఇప్పుడు ఎందుకు జరిగింది?:
    శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులు తొక్కసలాటకు గురికావడం, అందులో మరణించడం సాధారణమైన విషయం కాదు:
    టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజు :
    చంద్రబాబుగారి ప్రభుత్వం ఈపాపం మూటగట్టుకుంది:
    ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప ఆయనకు ఏమీ పట్టవు:
    గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ మనకు చేదు జ్ఞాపకమే:
    హిందూ ధర్మంమీద భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకనే ఇలాంటి ఘటనలు:
    భక్తులకు అందించే సేవలు అత్యంత పవిత్రమైనవి, వాటిని తేలిగ్గా చూడ్డంవల్లే ఇలాంటి ఘటనలు:
    పరమపవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసు:
    తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు?:
    తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉంది:
    వైయస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపైనే వారి దృష్టి:
    తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదు:
    అధికారుల మధ్య, పోలీసుల మధ్య సమన్వయం లేదు:
    శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ ఛైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువ:
    ఆయన పనంతా రాజకీయ దుష్ప్రచారం చేయడమే:
    టీటీడీ ఛైర్మన్‌ తన టీవీ కార్యాలయాలను తిరుమల టిక్కెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి:
    తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలి:
    టీటీడీ ఛైర్మన్‌ సహా, స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి:
    అసమర్థ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి: భూమన కరుణాకర్‌రెడ్డి

  • ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే: దేవాదాయశాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ 

    ==> ముక్కోటి ఏకాదశి ముందుగా అందరికీ తెలిసి వచ్చే కార్యక్రమం 
    ==> అప్పటికప్పుడు వచ్చే కార్యక్రమం కాదు 
    ==> లక్షలమంది వస్తారని తెలుసు 
    ==> అయినా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారు 
    ==> ప్రభుత్వం పూర్తిగా విఫలమై పోయింది 
    ==> బాధ్యులమీద చర్యలు తీసుకోవాలి 
    ==> తిరుమలను రాజకీయ కేంద్రంగా టీటీడీ ఛైర్మన్‌ మార్చాడు 
    ==> భక్తులను పక్కకు వదిలేసి వీఐపీల సేవలో ఛైర్మన్‌ తరిస్తున్నారు 
    ==> టీటీడీ ఈవోకూ అక్కడి కార్యక్రమాలమీద అవగాహన లేదు 
    ==> వీళ్లంతా రాజకీయ అజెండాలో భాగంగానే తిరుమలకు వచ్చారు తప్ప, భక్తులకు సేవ చేయాలని కాదు 
    ==> కనీస సౌకర్యలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం 
    ==> తొక్కిసలాటలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే 
    ==> నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు కనీసం ముక్కోటి ఏకాదశి సందర్భాన కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు 
    ==> ముఖ్యమంత్రిగారు పబ్లిసిటీ స్టంట్లు ఆపి, భక్తులకు మంచి సౌకర్యాలు అందిచడంపై దృష్టిపెట్టాలి 
    ==> మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నా 
    ==> గాయపడ్డ వారు కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను: దేవాదాయ శాఖ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

  • తిరుమల ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన

        
    "తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటుగా పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని కోరాను." అని కిషన్ రెడ్డి తెలిపారు.

  • తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌

    "వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను." అని పవన్ కళ్యాణ్‌ కోరారు.

  • తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం సమీక్ష

    •    డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసిన సీఎం చంద్రబాబు
    •    దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్న సీఎం చంద్రబాబు
    •    విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్న సీఎం
    •    ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.
    •    భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు.. అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించిన సీఎం
    •    ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి.
    •    మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.
    •    ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరించిన జిల్లా అధికారులు.
    •    మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం
    •    టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలన్న సీఎం
    •    రేపు ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

  • ఏడు కొండలు వాడా.. స్వామి మమ్మల్ని క్షమించు.. భక్తకోటి క్షమించండి 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

    ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి భాద్యతా రాహిత్యం గా వ్యవహరించి న అందరిపైనా పాలక మండలి కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు...
     తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో భక్తులు  మృతి చెందడంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని  కలచి వేసింది అన్నారు. .క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.బాదితకుటుంబాలకు అన్ని విధాలా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

  • మాజీ సీఎం  వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
    వైకుంఠ దర్శనం టోకెన్ల కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

  • టీటీడీ ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
    తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    • మృతుల సంఖ్య పెరుగుతోంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అస్వస్థతకు గురయిన భక్తులకు అందుతున్న వైద్యం.

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      సంఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు ఆరాతీస్తున్నారు. 

    • భక్తులకు అందాల్సిన వైద్యంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    • తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి. దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. గాయాలైన వారికి అందుతున్న చికిత్స పై అధికారులతో మాట్లాడారు.

    టీటీడీ చైర్మన్‌ దిగ్భ్రాంతి
    ఈ సంఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link